ఉన్నావో మృతురాలి తండ్రి ఏమంటున్నాడో చూడండి!

  • కోర్టుకు వెళుతున్న అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టిన దుండగులు
  • కాలినగాయాలతో మృతి చెందిన బాధితురాలు
  • నిందితుల మరణమే తమకు శాంతి అంటున్న కుటుంబ సభ్యులు
ఓవైపు దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో సమాజం సంబరాలు చేసుకుంటున్న తరుణంలోనే ఉన్నావో అత్యాచార బాధితురాలి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విచారణ నిమిత్తం కోర్టుకు వెళుతున్న బాధితురాలికి నిప్పుపెట్టడంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

దీనిపై ఉన్నావో మృతురాలి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా బిడ్డను చంపిన వాళ్లను హతమార్చితేనే తమకు సంతృప్తి అంటూ ఆమె తండ్రి వ్యాఖ్యానించారు. 'మా సోదరి ఇక లేదు, ఈ దారుణానికి కారణమైన ఐదుగురికి మరణశిక్ష విధించాలన్నదే మా డిమాండ్' అంటూ ఆమె సోదరుడు స్పందించారు.

దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ఉన్నావో బాధితురాలి మరణం పట్ల తీవ్ర విషాదానికి లోనైనట్టు తెలిపారు. నిందితులందరూ పోలీసుల అదుపులో ఉన్నారని, వీలైనంత వేగంగా విచారణ పూర్తిచేసిన నిందితులకు శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Unnao
Uttar Pradesh
Police
Yogi Adithyanath

More Telugu News